SDPT: గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో ఇవాళ తెల్లవారుజామున కంటైనర్ లారీ బోల్తాపడింది. ఆ సమయంలో రహదారిపై జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, లారీ అద్దాలు పగలగొట్టి లోపల చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. తెల్లవారుజామున కావడంతో ప్రాణనష్టం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
కంటైనర్ లారీ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం


