హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైస్ మిల్లులో అక్రమ కోతలు?

BHPL: చిట్యాల మండలం శాంతినగర్ సమీపంలోని లక్ష్మీనరసింహ రైస్ మిల్లులో ధాన్యం తూకం సందర్భంగా రైతులకు 50 నుంచి 60 కిలోల వరకు అదనపు కోత విధిస్తున్నారని సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఆరోపించారు. గతేడాది కూడా ఇదే విధంగా రైతులకు నష్టం జరిగిందని, జిల్లా కలెక్టర్ వెంటనే మిల్లును తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు.