హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామైక్య సంఘ భవనం ప్రారంభం

WGL: నెక్కొండ మండలంలోని అమీనాబాద్‌లో నిర్మించిన సరస్వతి గ్రామైక్య సంఘ భవనాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ భవనం మహిళా సంఘాల సమావేశాలకు, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.