హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీధి కుక్కల దాడిలో ఇద్దరికి గాయాలు

NGKL: ఉప్పునుంతల మండలంలోని కంసానిపల్లి గ్రామంలో ఇవాళ వీధి కుక్కల దాడిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కలు విపరీతంగా పెరగడం వల్ల బయటికి వెళ్లడానికి ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.