VKB: తాండూరు మండలంలోని పత్తికి మంచి ధర లభిస్తోంది. గతేడాది క్వింటాకు రూ.6,500 పలకగా, ఈ ఏడాది రూ.9 వేలు ధర రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరల నేపథ్యంలో కర్ణాటక నుంచి కూడా రైతులు పత్తిని విక్రయానికి తీసుకొస్తున్నారు. పత్తి ఏరేందుకు కూలీలకు డిమాండ్ పెరిగింది. తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
తాండూరులో క్వింటా పత్తి రూ.9 వేలు


