హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగతనాలపై ఎస్ఐ హెచ్చరిక!

KMR: దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దేవునిపల్లి ఎస్ఐ బి. రంజిత్ సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, విలువైన వస్తువులను భద్రపరచుకోవాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112కు కాల్ చేయాలని తెలిపారు.