హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి

JN: జనగామలో ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివరాజ్ యాదవ్, స్థానిక నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన అసాధారణ నాయకత్వ పటిమతో భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని, వారు చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సభ్యులు పాల్గొన్నారు.