హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల ఇలవేల్పు అయిన భద్రకాళి అమ్మవారికి గురువారం విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం,దశమితిథి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం ప్రధాన అర్చకుడు శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలిరాగా, ప్రాంగణం మొత్తం సందడి నెలకొంది.