హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూదానికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు: SI

SRD: జూదం ఒక వ్యసనమని, దాని బారిన పడి కుటుంబ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కొండాపూర్ SI సోమేశ్వరి సూచించారు. జూదం వల్ల కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. సరదాగా ప్రారంభమయ్యే ఈ అలవాటు చివరకు అప్పుల ఊబిలోకి నెట్టి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.