హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనంతసాగర్ పాఠశాలను పరిశీలించిన : MEO

SRD: కొండాపూర్ మండలం అనంతసాగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను MEO ఎలిజబెత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె పాఠశాల రికార్డులను, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థులతో సమావేశమై వారి అభ్యసన సామర్థ్యాలను అంచనా వేశారు. అనంతరం ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేస్తూ, విద్యార్థుల్లో రాత నైపుణ్యాలు, గణిత సామర్థ్యాలను మెరుగుపరచాలని పేర్కొన్నారు.