హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేవల్లిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

WNP: రేవల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ సుల్తాన్ అలీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమె ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సుల్తాన్ అలీ పేర్కొన్నారు.