ADB: గుడిహత్నూర్ మండలం కోలహరి గ్రామ ప్రజలు కలెక్టర్ రాజర్షి షాను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 20న గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమైక్య భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని కలెక్టర్ ను ఆహ్వానం అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ శివాజీ, రామ్ కిషన్, సంతోష్, జగదీశ్ ఉన్నారు.
తెలంగాణ
వీవో భవన ప్రారంభోత్సవానికి రావాలని కలెక్టర్కు ఆహ్వానం


