హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుప్పిమాంసం వండుకున్న ఐదుగురిపై కేసు నమోదు

MNCL: నెన్నెల మండలం మన్నెగూడెంలో పంట పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు చిక్కి మచ్చల దుప్పి మృతి చెందింది. కళేబరాన్ని కోసి మాంసం వండుకున్న కొమురెల్లి బాపురావు, ఎడ్ల భీమేష్, బత్తు సమ్మయ్య, గోలుసుల మల్లేష్, లగమ వెంకటేష్‌లపై కేసు నమోదైంది. కుశ్నపల్లి రేంజ్ అధికారి దయాకర్, సెక్షన్ అధికారి బాలకృష్ణ సోదాల్లో వండిన మాంసం దొరకడంతో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.