హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్ పత్రాల ప్రొసీడింగ్ పంపిణీ

SRD: హత్నూర మండలం దౌల్తాబాద్‌లో నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాలను గ్రామపంచాయతీ పాలకవర్గం, లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు గౌస్ పాషా మాట్లాడుతూ.. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.