హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదిలాబాద్‌లో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని DCC కార్యాలయంలో మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.