హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొన్నంను కలిసిన ఆర్టీసీ ఎండీ

HYD: TGSRTC నూతన ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం అమలు, రద్దీకి అనుగుణంగా అదనపు బస్సుల నిర్వహణపై సమీక్షించారు. ఎలక్ట్రిక్ బస్సుల పెంపు, ఛార్జింగ్ స్టేషన్లు, నూతన బస్సుల కొనుగోలు వేగవంతం చేయడంతో పాటు ఆర్టీసీ ఆర్థిక బలోపేతంపై చర్చించారు.