హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రమాదకరంగా రాళ్లవాగు వంతెన

MLG: వెంకటాపురం మండల ప్రధాన రహదారిపై ఉన్న రాళ్లవాగు వంతెన శిథిలావస్థకు చేరి కూలిపోయే ప్రమాదం నెలకొంది. పగుళ్లు రావడంతో గతంలో అధికారులు రాకపోకలు నిలిపివేసి ప్రత్యామ్నాయమార్గం ఏర్పాటుచేసినా, ఇసుక లారీలు వంతెనపైనే ప్రయాణిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనకూలితే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు.