BDK: మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి, పేదల సంక్షేమానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు


