KMR: పిట్లం మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహాన్ని గురువారం డీటీడీవో సౌజన్య సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
వసతి గృహాన్ని తనిఖీ చేసిన డీటీడీవో


