హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెల రోజులైనా పరిష్కారం కాని మురుగునీటి సమస్య

MBNR: మిడ్జిల్ ఎస్‌బీఐ బ్యాంకు నుంచి వెలువడుతున్న మురుగునీరు 25 అడుగుల రోడ్డుపై ప్రవహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. నెల రోజుల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.