హైదరాబాద్: 28°C
క్రీడలు

NZ vs IND: హెన్రీ నికోల్స్ సెంచరీ

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ప్లేరయ్ హెన్రీ నికోల్స్ సెంచరీ చేశాడు. 188 బంతుల్లో మూడంకెల మార్క్‌ను చేరుకున్నాడు. వెలింగ్టన్‌లో అతడికిది 15 ఇన్నింగ్స్‌ల్లో ఐదో శతకం కావడం గమనార్హం. ఓవరాల్‌గా కెరీర్‌లో 12వ సెంచరీ. గ్లెన్ ఫిలిప్స్ (78*)తో కలిసి నికోల్స్ ఆరో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 70 ఓవర్లకు 214/5గా ఉంది.