హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి వైవీఆర్ కాలనీలో కమిషనర్ పర్యటన

GNTR: తెనాలి వైవీఆర్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు గురువారం క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. రోడ్లపై ఆక్రమణలను గుర్తించి తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారికి ఆదేశించారు. డ్రైనేజీలను తక్షణమే శుభ్రం చేసి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు.