హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామ బస్టాండ్‌ గుంతలమయం

NTR: నందిగామ బస్టాండ్‌లో ఏర్పడిన గుంతలతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల రాకపోకలు సాగే ప్రాంతంలోనే గుంతలు ఉండటంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. వర్షం పడినప్పుడు గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరారు.