హైదరాబాద్: 28°C
క్రీడలు

వికెట్ల వేటలో శ్రీనాథ్‌ను దాటేసిన బుమ్రా

జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సృష్టించాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుత బౌలింగ్‌తో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ రికార్డును అధిగమించాడు. 3 వికెట్లు పడగొట్టిన బుమ్రా తన టెస్ట్ వికెట్ల సంఖ్యను 237కు చేర్చాడు. శ్రీనాథ్ 236 వికెట్లతో ఉన్నాడు. దీంతో భారత టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా పదో స్థానానికి చేరుకున్నాడు.