హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంస్య పతకం సాధించిన విద్యార్థి గణేష్

MHBD: కేసముద్రం మండలం కాట్రపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి గణేష్ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ కనబరిచి మండలానికి ఘనకీర్తి తీసుకువచ్చాడు. ఈనెల 14 నుంచి 16 వరకు గద్వాలలో నిర్వహించిన SGFI అండర్-14 రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో గణేష్ తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. భవిష్యత్తులో ఉన్నత విజయాలు సాధించాలని ప్రధానోపాధ్యాయుడు వీరభద్రయ్య ఆకాంక్షించారు.