హైదరాబాద్: 28°C
తెలంగాణ

చల్లూరుకు నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

KNR: చల్లూరులో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు సహకార సేవలను చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 240 కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఏడు సంఘాలు ప్రతిపాదించారు. కొత్త సంఘం అందుబాటులోకి వస్తే రైతులకు తక్కువ వడ్డీకి పంట రుణాలు లభించనున్నాయి.