హైదరాబాద్: 28°C
క్రీడలు

NZ vs IND: వికెట్ కోసం శ్రమిస్తున్న భారత్

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రెండో సెషన్ ముగిసింది. టీ బ్రేక్ సమయానికి ఆ జట్టు 49 ఓవర్లకు 140/5 పరుగులు చేసింది. భారత బౌలర్లకు హెన్రీ నికోల్స్ (66*), గ్లెన్ ఫిలిప్స్ (42*) కొరకరాని కొయ్యలా మారారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు ఇప్పటివరకు 70 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీని విడగొట్టడానికి భారత్‌ తీవ్రంగా శ్రమిస్తోంది.