హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్ చేసిన పోలీసులు

NRPT: మక్తల్ పట్టణ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. వడ్వాట్ వాగు నుంచి యజమాని లక్ష్మీకాంత్ రెడ్డి ఆదేశాలతో డ్రైవర్ గుర్రాల రాజు అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను మరికల్ వైపు తరలిస్తుండగా, టిప్పర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.