హైదరాబాద్: 28°C
తెలంగాణ

కెరమెరి ఎంపీడీవో ఆఫీసులో కలెక్టర్ తనిఖీ

ASF: వీబీజీ రాంజీ పథకం నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు రావడంతో కలెక్టర్ కె.హరిత బుధవారం కెరమెరి ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, ఎంబీ పుస్తకాలను పరిశీలించగా పని చేయకుండానే, కూలీలు హాజరుకాకున్నా టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మేట్లు నిధులు డ్రా చేసినట్లు గుర్తించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.