హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుగ్గలిలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలు

KRNL: ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా ప్రక్రియ కొనసాగించారంటూ తుగ్గలి ఎన్నికల అధికారులపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల గడువు దాటిన తర్వాత 3.30 గంటలకు వచ్చిన అభ్యర్థి నుంచి ఉపసంహరణ పత్రం స్వీకరించారని ప్రచారం జరుగుతోంది. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.