హైదరాబాద్: 28°C
క్రీడలు

కివీస్‌ను ఆదుకుంటున్న ఫిలిప్స్, నికోల్స్

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ను హెన్రీ నికోల్స్ (54*), ఫిలిప్స్ (31*) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆరో వికెట్‌కు వీరిద్దరూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నారు. మరోవైపు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నప్పటికీ వికెట్ దక్కడం లేదు. గత ఆరు ఓవర్లలో కివీస్ బ్యాటర్లు కేవలం 13 పరుగులు మాత్రమే సాధించారు. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ స్కోరు 43 ఓవర్లకు 117/5గా ఉంది.