భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హరియాణా తరఫున ఆడుతూ.. తమిళనాడుపై మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా అతడు ఈ క్లబ్లో చేరాడు. 346 టీ20 మ్యాచ్ల్లో చాహల్ ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్నర్


