హైదరాబాద్: 28°C
క్రీడలు

IPLకు ధోనీ గుడ్ బై.. అసలు కారణం చెప్పిన రైనా

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ఆటగాడిగా తన ప్రస్థానానికి ముగింపు పలకడానికి మోకాళ్ల సమస్యలే కారణమని మాజీ క్రికెటర్ సురేష్ రైనా వెల్లడించాడు. రెండు మోకాళ్లలో వాపు కారణంగా ధోనీ ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపాడు. ఎంత ప్రయత్నించినా శరీరం సహకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు. ఇకపై చెన్నై సూపర్ కింగ్స్‌కు మెంటార్‌గా సేవలందించనున్నాడు.