హైదరాబాద్: 28°C
వార్తలు

'మంచినీరు, వీధి దీపాల సమస్యలు పరిష్కరించాలి'

KRNL: ఆదోని పట్టణంలో మంచినీరు, వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నాయకులు , 19వ వార్డు కౌన్సిలర్ లక్ష్మన్న ఇవాళ మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్‌ను కోరారు. నాలుగు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పలుచోట్ల వీధి దీపాలు వెలగడం లేదని తెలిపారు. మంచినీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.