హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

20న తీరం దాటనున్న అక్వాన్ తుఫాను

NLR: అక్వాన్ తుఫాను 20న మధ్యాహ్నం నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఉదయం చెన్నైకి 580 కిలోమీటర్ల తూర్పున కేంద్రీకృతమైన ఇది తీవ్ర తుఫానుగా మారనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, తీర జిల్లాల యంత్రాంగం విపత్తు స్పందన బృందాలను సిద్ధంగా ఉంచింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు