హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

మధ్యప్రదేశ్ జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొత్తగా నిర్మించిన క్యాటరింగ్ స్టాల్‌లో ఈ మంటలు చెలరేగినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.