హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులంలో న్యాయమూర్తి తనిఖీ

BDK: అన్నపురెడ్డిపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకులాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం బాల్యవివాహాల నిరోధక చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.