హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండయ్యపల్లిలో 24 మందికి చేయూత పెన్షన్లు మంజూరు

KNR: గంగాధర మండలం కొండయ్యపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఆముదాల వెంకటమ్మకు చేయూత పెన్షన్ మంజూరైంది. బుధవారం గ్రామ సర్పంచ్ మల్యాల తిరుపతి ఆమె ఇంటికి వెళ్లి మంజూరు పత్రాన్ని అందజేశారు. గ్రామంలో మొత్తం 24 మందికి చేయూత పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.