హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆదివాసీ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం'

ASF: డిసెంబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఆదివాసీ హక్కుల సభకు 9 తెగల ఆదివాసీ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వాంకిడి ఆదివాసీ భవన్‌లో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు పంద్రం సురేష్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి ప్రతి కుటుంబం తరఫున ఒకరు సభకు హాజరయ్యేలా చూడాలని, మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు.