హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ పింఛన్లు: ఎమ్మెల్యే

HNK: పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో బుధవారం 13 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల పత్రాలను పంపిణీ చేశారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని తెలిపారు. కుడా చైర్మన్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.