హైదరాబాద్: 28°C
తెలంగాణ

4,867 మందికి చేయూత పింఛన్లు మంజూరు

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో 4,867 మంది వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మంజూరైన చేయూత పింఛన్ల పత్రాలను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సాంకేతిక కారణాలతో పింఛన్లు రానివారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, వారికి పింఛన్లు ఇప్పించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.