హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్తీ కల్లుపై అధికారుల కొరడా

KMR: మహమ్మద్ నగర్ మండలం కొమలంచలో కల్తీ కల్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. కల్లు సేవించిన ఇద్దరి నమూనాల్లో మత్తు పదార్థాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో దుకాణ యజమానులు రౌతు అంజాగౌడ్, రౌతు లక్ష్మాగౌడ్‌లపై కేసులు నమోదు చేశారు. దాడుల్లో సీఐ శ్రీధర్, ఎస్సై శివకుమార్ పాల్గొన్నారు.