హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే

GDWL: ప్రజాపాలనలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం పెదొడ్డి గ్రామంలో లబ్ధిదారు గుడిసె నరసింహులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి కానుక అందజేశారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు కాగా, 2 వేలకుపైగా నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. మిగతా అర్హులకు రెండో విడతలో ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.