హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల నియమాలు పాటించాలి: ఎస్సై

ఏలూరు జిల్లా గుడివాకలంక గ్రామంలో రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బుధవారం ప్రజలకు అవగాహన కల్పించారు. రూరల్ ఎస్సైలు వి. వెంకటేశ్వరరావు, బి. నాగబాబు గ్రామంలో పర్యటించి ఎన్నికల నిబంధనలు వివరించారు. ఓటర్లను డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు గురిచేయడం, బెదిరింపులు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం నేరమని తెలిపారు.