హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆర్టీసీ ఏసీ బస్సుల్లో రాయితీ'

కోనసీమ: ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు టికెట్ ధరలపై 10 నుంచి 20 శాతం వరకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. అమలాపురం నుంచి హైదరాబాద్, తిరుపతికి వెళ్లే అమరావతి, నైట్ రైడర్ బస్సుల్లో రానుపోను టికెట్లపై 20 శాతం, విశాఖపట్నం, విజయవాడకు వెళ్లే ఇంద్ర బస్సుల్లో 10 శాతం రాయితీ అందిస్తున్నట్లు వెల్లడించారు.