KKD: పిఠాపురం మండల పరిషత్ ఈ నెల 19న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో స్వప్న బుధవారం తెలిపారు. ముందుగా కో-ఆప్షన్ ఎంపీటీసీ ఎన్నిక నిర్వహించి, అనంతరం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేపడతామన్నారు. అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పిఠాపురంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు: ఎంపీడీవో


