హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమికే ప్రజల మద్దతు: ముప్పిడి

E.G: ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజల మద్దతు కూటమికేనని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.