హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్ లో జరిగిన సమీక్షలో

అనకాపల్లి కలెక్టరేట్ లో జరిగిన సమీక్షలో భూ రీ-సర్వేపై కలెక్టర్ విజయకృష్ణన్ గడువు విధించారు. పెండింగ్ పనులు డిసెంబర్లోపు పూర్తి చేయాలని, 81 గ్రామాల వివరాలను నెలాఖరులోగా జేసీ లాగిన్లో క్లోజ్ చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 48 గంటల్లో ఓటర్ స్లిప్పుల పంపిణీ, బ్యారికేడింగ్ పూర్తి చేయాలన్నారు. అలసత్వంపై చర్యలు తప్పవని హెచ్చరించారు.