హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉచిత శిక్షణతో మహిళల్లో ఆత్మవిశ్వాసం'

PLD: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు రెడ్‌క్రాస్ సొసైటీ, కేర్ బ్యూటీ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత బ్యూటీ పార్లర్ శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా ఛైర్మన్ దస్తగిరి పర్ల తెలిపారు. శిక్షణ పొందిన మహిళలకు స్వయం ఉపాధి, బ్యాంకు రుణాలపై అవగాహన కల్పించారు. నైపుణ్యాలను వినియోగించుకుని సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని నిర్వాహకులు సూచించారు.