హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత న్యాయ సేవలపై అవగాహన

SRPT: కోదాడ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ సివిల్ జడ్జి సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆర్థిక స్థోమత లేని పేదలకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందిస్తామని తెలిపారు.